ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ సిద్దం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ సిద్దం..!
– ఈ సేవా కార్యాలయంలో ఏర్పాటు
– ముమ్మరంగా కార్యాలయ పనులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోంది. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్టేషన్‌ ఏర్పాటు కాబోతుంది. ఇందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యకు పోలీస్టేషన్‌ లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఇక నుంచి ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించనుంది. పట్టణంలో ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ కోసం రూ. 10 లక్షలు నిధులు కేటాయించారు.

పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో ఉన్న ఈ సేవా భవనాన్ని ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌గా ఎంపిక చేశారు. పోలీసు అధికారుల విజ్ఞప్తి మేరకు పురపాలక సంఘం అధికారులు ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌కు అప్పగించాలని నిర్ణియించారు. ఈ అంశంపై మున్సిపల్ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ మేరకు అప్పటి ఆర్డీఓ అశోక్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మార్చిలో లేఖను అందజేశారు. అప్పటి నుంచి ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటుకు అవసరమైన అంశాలపై దృష్టి సారించారు. త్వరలోనే అక్కడ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ప్రారంభించాక ట్రాఫిక్‌ సమస్యను అరికట్టడానికి పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారు. పనులు చివరి దశకు చేరుకున్నాయి. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి చేతుల మీదుగా ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. ప్రత్యేకంగా ఎస్‌ఐతో పాటు ఇతర సిబ్బందిని నియమించనున్నారు. ప్రస్తుతం భవనంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!