అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య

కెరీర్ తాండూరు వికారాబాద్

అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య
– మల్‌రెడ్డిపల్లి పాఠశాలలో తర్పీదు
– నెల రోజులుగా సెల్ప్‌ డిఫెన్స్‌పై శిక్షణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలపై ఎలాంటి అఘాయిత్యం జరుగుతుందో అనే ఆందోళన కర పరిస్థితులు ఏర్పడింది. దాడులు, అఘాయిత్యాల నుంచి బాలికలు రక్షణ పొందేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెల్ప్‌ డిఫెన్స్‌ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ పరిధి మల్‌ రెడ్డిపల్లి పాఠశాలలో అమ్మాయిలుకు ఆత్మరక్షణ విద్యను నేర్పిస్తున్నారు. గత నెల ప్రారంభించిన ఈ కార్యక్రమం నెల రోజులు పూర్తిచేసుకోంది. పాఠశాలలో మాస్టర్ సి. బస్వారాజ్ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్‌లో పాటించే మెళకువలలో తర్పీదు ఇస్తున్నారు. ఈ సందర్బంగా మాస్టర్ బస్వారాజ్ మాట్లాడుతూ… ఆడపిల్లల ఆత్మ రక్షణ కొరకు ప్రభుత్వం ఈ సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయయంపై హర్షం వ్యక్తం చేశారు. ఆకాతాయిల చేతుల్లో చిక్కుకుంటున్న ఆడపిల్లలు ఈ సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా తమ తామే చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మహేష్, పాఠశాల బృందం తదితరులు పాల్గొన్నారు.