మైనార్టీ సంక్షేమానికి ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

మైనార్టీ సంక్షేమానికి ప్రాధాన్యం
– మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి
– మంత్రిని కలిసిన తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిలు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి మహేందర్ రెడ్డి నివాసంలో తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అబ్దుల్ హాది, మహమ్మద్ ఖుర్షిద్‌ హుస్సేన్, మహమ్మద్ అబ్దుల్ హమీద్, షౌకత్ పటేల్, నాయక్ అలీ,ఎంఎస్ సత్తార్ గోల్కొండ, నసీముద్దీన్, నయీమ్ అప్పు, మహమ్మద్ ఫయాజ్ అలీ తదితరులు మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిలను కలిశారు. సర్వే నెంబర్ 52 లో స్మశాన వాటికకు ఐదెకరాలు, ఈద్గాకు మరో ఐదు ఎకరాలు కేటాయించాలని వినతి పత్రం అందించారు.

అలాగే పాత ఈద్గా మైదానం ఉన్న సర్వేనెంబర్ 109 లో మరో 25 గుంటల భూమికి ప్రోసిడింగ్లు ప్రభుత్వపరంగా ఇప్పించాలని మైనార్టీ బాలికల పాఠశాల పరిసరాల్లో షాపింగ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు. రాజు కాలనీ, ఇందిరా కాలనీ ప్రాంతాలలో ఉన్న మసీదుల స్థలాలకు ప్రభుత్వపరంగా పట్టా సర్టిఫికెట్లు ఇప్పించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో జనాభా రేషియో ప్రకారం తమకు 40 శాతం ఇళ్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు. అలాగే పెండింగ్లో ఉన్న తాండూరు ఇందిరా చౌక్ నుండి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు వెడల్పు పనులను వెంటనే ప్రారంభించి, పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్బంగా మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ సర్కారు మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.

ఇందులో భాగంగా తాండూరులోని మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్లో మైనారిటీల కోసం తాను ప్రకటించిన రూ. 50 లక్షల నిధులను అందేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మైనార్టీ నాయకులు షేక్ ముజీబ్, అబ్దుల్ రషీద్, మహమ్మద్ గౌస్ భాష, ఉర్దూ ఘర్ చైర్మెన్ అబ్దుల్ రజాక్, జిల్లా ఆర్టీఏ డైరెక్టర్ మహమ్మద్ జావిద్, జైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు