ఆధార్ కోసం ఆగమాగం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆధార్ కోసం ఆగమాగం..!
– ఈకేవైసీ కోసం లబ్దిదారులు ఇక్కట్లు
– పోస్టాఫీసుకు పోటెత్తడంతో ఉద్రిక్తత
– పోలీసులు రంగప్రవేశంతో సద్దుమణుగు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆధార్ విషయంలో ఇస్తున్న ఆప్ డేట్ విషయంలో లబ్దిదారులు ఆగమాగం అవుతున్నారు. రాజాగా ఈకేవైసీ కోసం తాండూరులో లబ్దిదారులు ఆందోళనకు గురయ్యారు. నమోదు కోసం పోస్టాఫీసు వద్దకు పోటెత్తడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశంతో ఆందోళన సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే… రేషన్ బియ్యం పొందేందుకు ఆధార్ ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్ ఈకేవైసీ కోసం తాండూరులోని పోస్టాఫీసులోనే ఏకైక కేంద్రం ఉండడంతో వినియోగదారులు కార్యాలయానికి పోటెత్తారు. అయితే పోస్టాఫీసులో ఉన్న ఆధార్ కేంద్రంలో ఒక రోజుకు 25 నుంచి 30 టోకెన్ల ద్వారా ఆప్ డేట్ సేవలు అంది స్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అక్కడికి చేరుకున్నారు.

లబ్దిదారులతో కలిసి అధికారులను ప్రశ్నించే క్రమంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వినియోగదారులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు ఇచ్చిన విధంగా టోకెన్ లు పొంది ఈకేవైసీ చేసుకోవాలని సూచించారు. దీంతో.. వినియోగదారులు శాంతించారు. అక్కడితో ఆందోళన సద్దుమణిగింది. మరోవైపు తాండూరులో గతంలో 5 ఆధార్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం పోస్టాఫీసులో ఒక్కటి మాత్రమే కొనసాగుతుండడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారులకు అనుగుణంగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, లేదంటే ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి వస్తుందని అభిప్రాయాలను తెలిపారు.

ఇదికూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు