రిజిస్ట్రేషన్ ఇబ్బందులు పరిష్కరించాలి
– త్వరలోనే కొత్త కమిటి ఏర్పాటుకు నిర్ణయం
– తాండూరు రియల్ వ్యాపారవేత్తల సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని తాండూరు రియల్ వ్యాపారుల సంఘం ప్రతినిధులు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం చెన్గెష్పూర్ రోడ్డు మార్గంలోని కింగ్ ప్యాలెష్ లో రియల్ వ్యాపారవేత్త అబ్దుల్ అలీం(షల్లో) ఆధ్వర్యంలో పట్టణ రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. కాని తాండూరులోనే కచ్చా లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగడం లేదన్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా రియల్. ఎస్టేట్ రంగం పడిపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నామని అన్నారు.
కావున కచ్చా లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తే వ్యాపారులకు అసరాగా ఉంటుందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా మంత్రులను, స్థానిక ఎమ్మెల్యేను కలిసి విన్నవించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా గతంలో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘంకు త్వరలోనే కొత్త కమిటిని ఎన్నుకుంటామని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి బావనోళ్ల శంకర్ యాదవ్, అబ్దుల్లా ముజాహిద్, అబ్దుల్ రజాక్, మహమ్మద్ ఇర్ఫాన్, అబ్దుల్ జబ్బార్ పటేల్, తాహేర్ ఖురేషి, గౌరి రాములు, మహ్మద్ యాసిస్, మనోహర్ యాదవ్, అబేద్ హుస్సేన్, ఇమ్రాన్ ఖాన్, అంజద్ అలీ పాష, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

