అభివృద్ధిని, సంక్షేమాన్ని చూండండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అభివృద్ధిని, సంక్షేమాన్ని చూండండి..!
– మీ బిడ్డగా ఆశీర్వదిస్తే మరింత ప్రగతి చూపిస్తా
– పేదలకు వరాలందించేలా బీఆర్ఎస్ మెనిఫెస్టో
– కారు, గుర్తుకు ఓటేసీ విజయ ఢంకా మోగించండి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావ సభ సూపర్ సక్సెస్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి కారు గుర్తుకు ఓటేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం పెద్దేముల్ మండలం గొట్లపల్లి వద్ద తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రసగించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఐదేండ్లలో మొదటి ఏడాది ఎన్నికలు, రెండు, మూడో యేడాదిలో కరోనా కష్టకాలం వచ్చిందన్నారు. మిగతా రెండేళ్లలో 40 ఏండ్లుగా జరగని అభివృద్ధి చేశానని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామిలను కాలుష్యాన్ని దూరం చేయడం జరిగిందన్నారు.

తాండూరుకు పారిశ్రామిక వాడ బైపాస్ రోడ్డు, తాండూరు పట్టణంలో రూ.74 కోట్లతో రైల్వే బ్రిడ్జి పనులు చేపట్టడం జరిగిందన్నారు. తాండూరులోని జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. పట్టణంలో హైమస్ లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేసి తెలంగాణను ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్ కే దక్కిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రవేశ పెట్టిన మెనిఫెస్టోలో ఆసరా ఫించన్ రూ. 5 వేలకు పెంపు, వికలాంగ ఫించన్ రూ.6 వేలకు పెంపు, రూ.400లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ. 3వేల భృతి, రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ, రూ.15లక్షలతో ఆరోగ్య బీమా, రైతు బందు సాయం రూ. 16వేలకు పెంపు వంటి నిర్ణయాలు చారిత్రాత్మకమన్నారు. ఎన్నికల మెనిఫెస్టోతో అనేక హామీలు ప్రకటించిన కేసీఆర్ కేసీఆర్ అపోజిషన్ పార్టీల మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారని అన్నారు.


గతంలో తెలంగాణను కూల్చేందుకు బీజేపీ రూ. 100 కోట్లతో కొనుగోలు చేసేందుకు కుట్ర చేస్తే తాండూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్లను జైలుపాలు చేశానని గుర్తుచేశారు. ఇక కాంగ్రెస్ వాళ్లకు స్థానిక అభ్యర్థులు దొరకపోవడంతో పరాయి ప్రాంతాలకు చెందిన వాళ్లను తెరమీదకు తెస్తున్నారని అన్నారు. ఎంతైనా సొంత బిడ్డ సొంతోడే.. పరాయి వాడు పరాయి మనిషే అవుతారని అన్నారు. అయినా కూడా వాళ్లకు తాండూరు స్థితిగతులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పరాయి వాళ్లను తరిమి కొట్టాలని, అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి విజయఢంకా మోగిస్తే తాండూరును మరింత ప్రగతి వైపు తీసుకెళతానని అన్నారు. తాండూరు ప్రజలను గుండెల్లో దాచుకుంటానని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, శ్రీశైల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్లోళ్ల నర్సింలు, మార్కెట్ కమిటి చైర్మన్ వీణ శ్రీనివా చారి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, పట్టణ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సిందూజ గౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారీ, పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, యువనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత