పోలీసు శాఖ వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యమైంది

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పోలీసు శాఖ వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యమైంది
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
– ఓపెన్ హౌస్ ద్వారా విద్యార్థులకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో ప్రాముఖ్యమైన పోలీసు వ్యవస్థపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి అన్నారు. పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్టేషన్లో పోలీసు విధులు, ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, కమ్యూనికేషన్ వ్యవస్థ, రికార్డుల నిర్వహణ, లాకప్ గదులు, సీసీ కెమెరాలు గురించి వివరించారు.

అదేవిధంగా పోలీసు ఆయుధాల నిర్వహణ, సైబర్ క్రైమ్, షీటీం పనితీరు తదితర అంశాలపై కూడ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పోలీసు వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలన్నారు. సమాజంలో పోలీసు విధుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసు సిబ్బంది, స్కూల్ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత