ఎక్కడోళ్లు.. అక్కడే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎక్కడోళ్లు.. అక్కడే..!
– ముందుకు రాని ఎమ్మెల్యే అభ్యర్థులు
– మొదటి రోజు నామినేషన్లు నిల్
– ప్రకటించిన ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్లది ప్రధాన ఘట్టం. బరిలో నిలిచే అభ్యర్థులు జాతకాలు, ముహుర్తాలు చూసి వేసుకుంటారని మరోసారి రుజువు అయ్యింది. తాండూరులో ఎన్నికల్లో భాగంగా ప్రకటించిన నామినేషన్ల ప్రక్రియకు మొదటి రోజు స్పందన లభించలేదు. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా ఎవ్వరు ముందుకు రాకుండా ఎక్కడి వాళ్లు అక్కడే అన్నట్లుగా ఉండిపోయారు. శుక్రవారం నుంచి ఈనెల 10వ తేది వరకు తాండూరు అసెంబ్లీ నియిజకవర్గానికి సంబంధించి నామినేన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుందని ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.

గడువు రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. కాని మొదటి రోజు అభ్యర్థుల నుంచి కరువైంది. ముహుర్తం లేదనో.. జాతకం బాలేదనో.. నామినేషన్లు సమర్పించేందుకు ఎవ్వరు ముందుకురాలేదు. ఈ సందర్భంగా ఆర్డీఓ, ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మొదటి రోజు ఎలాంటి నామినేషన్లు రాలేదని ప్రకటించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం బరిలో నిలిచే అభ్యర్థులు నియమాలను పాటించాలన్నారు. క్రిమినల్ కేసులు, ఆస్తులు, విద్యార్హత వివరాలను పత్రాల్లో పొందుపర్చాలన్నారు. అభ్యర్థి వెంట ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అందరు సహకరించాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..