ప్రజారంజక పాలనే ధ్యేయం

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజారంజక పాలనే ధ్యేయం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– అట్టహాసంగా ప్రజా భవన్ ప్రారంభోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజారంజక పాలన అందించడమే ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా భవన్ ను అట్టహాసంగా ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్చరణల మద్య పూజలు అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సతీమణి అరుణ రెడ్డిలు సతీసమేతంగా పూజలో పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు.

అంతకుముందే ప్రజా భవన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలన్నా సుందరంగా అలంకరించారు. శుక్రవారం ఉదయం సుమూహర్తములో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరిగిందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సహాకారంతో తాండూరు నియోజకవర్గ ప్రజలకు ప్రజారంజక పాలన అందిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రజా భవన్ లో విన్నవించుకోవచ్చన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, రాంచంద్రారెడ్డి, రమేష్, మహిళ నాయకురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.