ఉన్నత విద్య లక్ష్యంగా విద్యాసంస్థల నిర్వహణ
– ఘనంగా పెరుమాళ్ల వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు
– విద్యార్థులు, ఉపాధ్యాయులు, అభిమానుల శుభాకాంక్షల వెల్లువ
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యాసంస్థల ప్రతినిధి, సీనియర్ పాత్రికేయుడు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయంతో పాటు ఆపిల్ కిడ్స్ స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఘనంగా నిర్వహించారు.

అభిమానులు పీవీఆర్ని శాలువాతో సన్మానించి వారి సమక్షంలో కేక్ కట్ చేయించారు. స్వీట్లు, కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేశారు. జన్మదినం సందర్భంగా 100 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్లను ఉచితంగా అందజేశారు. ఆయాలకు చీరలను అందజేశారు. అదేవిధంగా చైతన్య కాలేజీలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… పేద, మధ్యతరగతి పిల్లలకు ఉన్నత విద్య లక్ష్యంగా తాండూరులో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సమాజ సేవలో భాగంగా తమ వంతుగా సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా పరోక్షంగా తమ మేలును కోరుతూ ఆశీర్వదిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ సాయి మేధ విద్యాలయ డైరెక్టర్లు మంజుల రెడ్డి, కల్పన, ప్రిన్సిపల్ సజిత వైస్ ప్రిన్సిపల్ నవీన్ కుమార్, చైతన్య కళాశాల డైరెక్టర్ నిర్మల రెడ్డి, ప్రిన్సిపల్ జగ్జీవన్ రెడ్డి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి..

