బతుకమ్మ బతుకమ్మా.. ఉయ్యాలో..!
– తాండూరులో సందడిగా సంబరాలు
తాండూరు, దర్శని ప్రతినిధి: బతుకమ్మ.. బతుకమ్మా.. ఉయ్యాలో.., చిత్తు చిత్తూల బొమ్మ.. శివుని ముద్దూల గుమ్మా.. అంటూ బతుమ్మ పాటలు తాండూరులో మార్మోగాయి. రెండో రోజు గురువారం తాండూరు పట్టణంలో బతుకమ్మ సంబరాలు సందడిగా జరిగాయి. పట్టణంలోని ఇందిరానగర్, సాయిపూర్, మల్‌రెడ్డిపల్లి, పాత తాండూరు, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. మల్‌రెడ్డిపల్లిలో బీజేపీ కౌన్సిలర్ సాహు శ్రీలత నివాసంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం బతుకమ్మ సందర్భంగా మహిళలు, ఆడపడుచులు బతుకమ్మను రంగురంగుల పూలతో అలంకరించారు. బతుకమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్ము చుట్టూ మహిళలు, యువతులు ఆట పాటలతో చిందులు వేశారు. చిన్నీ మా బతుకమ్మ.. చీనా రెక్కల బతుకమ్మ, ఓ నిరుమలా.. లలీతా ఆడిపాడరే.., రామా.. రామా ఉయ్యాలో.. రామనే శ్రీరామా.. ఉయ్యాలా పాటలతో వీదులన్నీ మార్మోగాయి.


