గందరగోళంగా ముసాయిదా జాబితా..!
– ఒకే వార్డులో ఇతర వార్డుల ఓటర్లు
– సాయిపూర్ జాబితాను సవరించాలి
– బీజేపీ యువనాయకులు కుర్వ జగదీష్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల ఓటర్ల ముసాయిదా జాబితా గందరగోళంగా ఉందని బీజేపీ యువనాయకులు కుర్వ జగదీష్ అన్నారు.

మున్సిపల్ ఎన్నికలలో భాగంగా అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సాయిపూర్ ప్రాంతానికి సంబంధించిన ఓటర్ల జాబితా పూర్తిగా గందరగోళంగా మారిందని అన్నారు. సాయిపూర్‌లో సుమారు 3వార్డులు ఉండగా ఒక వార్డులో ఇతర వార్డుల ఓటర్లను చేర్చినట్లు ముసాయిదా జాబితాను విడుదల చేశారని అన్నారు.

ఒక్కో వార్డులో దాదాపు 500ల మంది నుంచి 800ల మంది వరకు ఇతర వార్డుల ఓటర్లను చేర్చారని తెలిపారు. అధికారులు ఓటర్ల జాబితాను సవరించాలని డిమాండ్ చేశారు. ఏ వార్డులకు సంబంధించిన ఓటర్లను అదే వార్డులో ఉండేలా పారదర్శకతను పాటించాలని అన్నారు. తుది జాబితా నాటికి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి…

