పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు..!

కెరీర్ జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు..!
– పది పాసైతే చాలు
– రాత పరీక్షలేకుండానే సెలక్షన్స్
– త్వరలో నోటీపికేషన్‌
దర్శిని డెస్క్ : దేశంలోని నిరుద్యోగులకు తపాల శాఖ గుడ్‌ న్యూస్ చెప్పబోతోంది. గతేడాది జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా వేల పోస్టులను భర్తి చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే నోటీఫికేషన్ విడుదల చేసే ప్రకటించే అవకాశం ఉంది. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.

అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అయితే అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండానే సెలక్షన్స్‌ నిర్వహించే అవకాశం ఉంది.

భర్తి చేసే పోస్టులు ఇవే…
ఎంపికైనవారిని బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌.. హోదాలో విధులు సంబంధిత కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ప్రారంభ వేతనం అందజేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పని గంటలు ఉంటాయి. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌ విధులను కూడా నిర్వహించవచ్చు. ఇందుకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో ప్రోత్సాహం అందిస్తారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇదికూడ చదవండి…
https://www.dharshininews.com/25663/