రూ.5ల కోసం ఫైట్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రూ.5ల కోసం ఫైట్..!
– పోలీస్టేషన్‌కు చేరిన పంచాయతీ
– వికారాబాద్‌ లో ఘటన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : రూ. 5ల కోసం జరిగిన ఫైట్‌లో ఓ వ్యక్తి వాతలు వచ్చేలా గాయపడ్డాడు. సర్దుకు పోవాల్సిన వివాదం కాస్తా పోలీస్టేషన్‌ దాకా వెళ్లింది. దీంతో పంచాయతీ కేసుల దాకా వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ మున్సిపల్‌లో శ్రీనివాస్ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. పని పూర్తి పూర్తయ్యాక వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గెరిగేంట్ పల్లిలోని కల్లు దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడ వ్యాపారి దత్తాత్రేయ గౌడ్ కల్లు సీసా ధర 15లకు విక్రయిస్తున్నాడు.

అయితే కల్లు సేవించిన తరువాత కార్మికుడు శ్రీనివాస్ గతంలో సీసా రూ. 10లే ఉండేదని, ఇప్పుడు రూ. 15లకు ఎలా పెంచుతారని అడిగాడు. దీంతో శ్రీనివాస్, వ్యాపారి దత్తాత్రేయ గౌడ్ మద్య వాగ్వివాదం జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో వ్యాపారి దత్తాత్రేయ గౌడ్ వారి అనుచరులతో కలిసి తనపై దాడి చేశారని బాధితుడు వాపోయాడు. తలపై రక్తం వచ్చేలా గట్టిగా కొట్టి దాడి చేశారని, ఒంటిపై దాడి చేయడం వల్ల వాతలు తేలాయని పోలీసులకు చూపించాడు.

అంతటితో ఆగకుండా తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని వికారాబాద్ పోలీస్ స్టేషన్‎లో బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదికూడా చదవండి…

ఆధునాతన పద్దతులతో అధిక దిగుబడులు