టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌కు డేట్ ఫిక్స్

తెలంగాణ రాజకీయం హైదరాబాద్

టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌కు డేట్ ఫిక్స్
– నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
– 25న నూత‌న అధ్య‌క్షుడి ఎన్నిక‌
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో కోలాహలం నెలకొన్నది. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక‌కు ముహూర్తం ఖ‌రారు కావ‌డమే ఇందుకు కార‌ణం. పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఆదివారం నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. దీంతో పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక కోసం ఏర్పాట్లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తెలంగాణ భవన్ లో నామినేషన్లు స్వీకరించనున్నారు వెల్లడించారు. ఈనెల 23న శనివారం ఉదయం 11 గంటలకు నామినేషన్లను పరిశీలించనున్నారు. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని వెల్ల‌డించారు. 25న హెచ్‌ఐసీసీలో జరిగే ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని స్ప‌ష్టం చేశారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తయిన తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు. సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో కోలాహలం నెలకొన్నది.

ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే…
22 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది.
23 న స్క్రూటినీ ఉంటుంది
24 న నామినేషన్ల ఉపసంహరణ
ఈనెల 25 న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ.
ఇదే రోజు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది