మురికి చోట ముగ్గులు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మురికి చోట ముగ్గులు..!
– బహిరంగ చెత్త ప్రదేశాల్లో చెట్లు
– మున్సిపల్‌ కొత్త సంప్రదాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మురికి ప్రదేశాలను పరిశుభ్రంగా మార్చే ప్రయత్నానికి మున్సిపల్ శ్రీకారం చుట్టుంది. పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో ఎవ్వరు చెత్త వేయకుండా అవగాహన కల్పించే చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని పలు ప్రాంతాలలో ఉన్న బహిరంగ చెత్త ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతంలో చెత్తను తొలగించారు.

మళ్లీ ఈ ప్రదేశంలో చెత్త వేయకుండా అదే స్థానంలో అందమైన రంగవల్లులు వేయించారు. అంతేకాకుండా మొక్కలను కూడా నాటారు. ఇకనుంచి బహిరంగ ప్రదేశాల్లో ఎవ్వరు చెత్త వేయకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నారు. గత పదేళ్ల క్రితం ప్రత్యేక పాలనలో ఇదే విధానాన్ని కొనసాగించారు. చెత్త ప్రదేశాల్లో ముగ్గులు వేసి.. అక్కడ ఎవ్వరు చెత్త వేయకుండా ఓ పారిశుద్ధ్య కార్మికులను కాపలా పెట్టిన సంఘటనలు ఉన్నాయి. దీంతో అప్పట్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు చెత్తవేయడం మానేశారు. తాజాగా మళ్లీ పాత విధానాన్ని ప్రారంభించడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

పిచ్చోడి వీరంగం..!