నిమజ్జన ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు
– అన్ని శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక నిమజ్జన ఉత్సవాల ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, ఫైర్ తదితర శాఖల ఆధికారులతో 11న నిర్వహించే నిమజ్జన ఉత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. ఏర్పాట్లపై మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పలు శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో ఆరా తీశారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కోకట్ కాగ్నా వాగులో నిర్వహించె నిమజ్జనంకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు ఆయా శాఖల నుంచి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జనం ఉత్సవంలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించారు. అక్కడి నుంచి యాలాల మండలం కోకట్ కాగ్నా వాగును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, పట్టణ సీఐ సంతోష్ కుమార్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, పలు శాఖల అధికారులు హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

