ఖర్జూరం పాలు.. మెండు పోషకాలు..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

ఖర్జూరం పాలు.. మెండు పోషకాలు..!
– రోజూ తీసుకుంటే అనారోగ్యం పరార్
– చర్మం, ఎముకల ఆరోగ్యానికి మేలు
దర్శిని డెస్క్ : ఖర్జూరం గురించి అందరికి తెలిసిందే. పాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఖర్జూరం, పాలు రెండు తీసుకోవడంలో మనిషికి ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం, పాలలో పోషకాలు మెండుగా ఉండడం వల్ల మనిషికి వచ్చి పలు అనారోగ్య సమస్యలు పరార్ అవుతాయని అంటున్నారు. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. చర్మం మెరుస్తూ ఉండాలంటే తరుచుగా ఖర్జూరాతో పాటు పాలు కలిపి తీసుకోవడం మంచిది. ఖర్జూరం, పాలు తీసుకోవడం మంచి నిద్రకు సహాయపడుతుంది. రక్తహీనత సమస్యను తొలగిస్తుంది.

గర్భిణీ స్త్రీలకు కూడా ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. ఖర్జూరంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. పాలు జీర్ణవ్యవస్థను కూడా శాంతపరుస్తాయి. రాత్రిపూట ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల శరీరంలో శక్తిని కాపాడుతుంది. పాలతో ఎండు ఖర్జూరాలను తీసుకుంటుంటే రోగనిరోధక శక్తి పెరిగి పవర్ బూస్టరులా పనిచేస్తుంది.

చర్మానికి కూడా కొత్త కాంతినిస్తుంది. రక్తం లోపాన్ని తొలగిస్తుంది. రక్తపోటును నియంత్రించే శక్తి ఖర్జూరాలనుకున్నాయి. దంతాలు, ఎముకలకు మేలు చేస్తాయి. ఖర్జూరంలో సహజమైన చక్కెర ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. పాలలో ఉండే ప్రొటీన్లు శరీరాన్ని ఎక్కువ కాలం శక్తివంతంగా ఉంచుతాయి. పాలు కాల్షియం మంచి మూలం. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఖర్జూరంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది.

గమనిక: మీకు ఏదైనా రకమైన అలర్జీ ఉంటే ఖర్జూరం, పాలు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి. డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ తీసుకోవడం నియంత్రణలో ఉండాలి. ఖర్జూరాన్ని ఎక్కువ మోతాదులో తినడం వల్ల ఊబకాయం పెరుగుతుంది.

ఇదికూడా చదవండి…

రైల్వే ప్రయాణికులకు శుభవార్త..!