మట్టి లింగాలు.. మహోత్తరం..!
– కోటి లింగాల ప్రతిష్టాపనకు తోడ్పాటు
– లింగాలను తయారు చేస్తున్న తాండూరు మహిళలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కోటి లింగాల ప్రతిష్టాపన మహోత్తర కార్యక్రమానికి తాండూరు మహిళ భక్తులు చేయూతను అందిస్తూ ఆధ్యాత్మికతను చాటుకుంటున్నారు. వచ్చే శివరాత్రిని పోతిరెడ్డిపల్లి గ్రామం పిట్లం దగ్గర నిర్మిస్తున్న శివాలయంలో కోటి లింగాలను ప్రతిష్టించాలని సంకల్పించారు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు భక్తులు కోటి లింగాలను తయారు చేసే క్రతువులో నిమగ్నమయ్యారు. తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య ఆధ్వర్యంలో మహిళ భక్తులు కోటి లింగాలను తయారు చేస్తున్నారు.
పట్టణంలోని ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వెలసిన నగరేశ్వర దేవాలయంలో శివునికి ప్రీతిపాత్రమైన సోమవారంను పురస్కరించుకుని లింగాల తయారు కార్యక్రమాన్ని చేపట్టారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శివ నామస్మరణ చేస్తూ లింగాలను తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ మాట్లాడుతూ.. మహా కుంభమేళా, మహాశివరాత్రి సందర్భంగా కోటి లింగాలను తయారు చేయడం శుభప్రదమన్నారు. కోటి లింగాల తయారుకు తోడ్పాటు అందించడం ఎంతో భాగ్యమని అన్నారు. ఇందులో పాలుపంచుకున్న భక్తులకు ధన్యవాదలు తెలిపారు. కోటి లింగాల పూర్తి వరకు తయారుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవీ మహిళ సంఘం సభ్యులు, మహిళ భక్తులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

