ఓపెన్‌ స్కూల్‌కు మరో అవకాశం..!

కెరీర్ తాండూరు తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఓపెన్‌ స్కూల్‌కు మరో అవకాశం..!
– పది, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు
– గడువు, ఎలా చేసుకోవాలంటే..?
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : పలు కారణాలతో చదువుకు దూరమైనవారు మళ్లీ చదువుకునేందుకు తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) మహత్తర అవకాశం కల్పిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇది వరకే ప్రవేశాల ప్రక్రియ పూర్తయినప్పటికీ అభ్యర్థులకు మరో అవకాశం ఇస్తూ ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు తత్కాల్‌ విధానంలో ప్రవేశాలు కల్పిస్తోంది. పది, ఇంటర్‌ చదువుకోవాలనే వారు సద్వినియోగం చేసుకొని తమ కలలు సాకారం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

బోధనా విధానం ఇలా..
పదో తరగతికి 14, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి 15 ఏళ్లు నిండి ఉండాలి. బడి మధ్యలో మానేసిన వారు పది, పదో తరగతి పూర్తయిన వారు ఇంటర్‌ చదవొచ్చు. సరళమైన విద్యావిధానం, సెలవు రోజుల్లో మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. మహిళలు, పలు వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వారికి సదావకాశం. స్వీయ అభ్యసన సామగ్రి ఇంటికే పంపుతారు. యూట్యూబ్‌ ఛానల్, వెబ్‌సైట్ ద్వారా పాఠ్యాంశాలు నేర్చుకోవచ్చు. ఒకసారి ప్రవేశం పొందిన నుంచి 5 ఏళ్లు లేదా, 9 పర్యాయాలు పబ్లిక్‌ పరీక్షలు రాయొచ్చు.

గడువు, దరఖాస్తు ఇలా
ఆన్‌లైన్, ఏపీ, టీఎస్‌ ఆన్‌లైన్, మీసేవ కేంద్రాలతో పాటు https:///www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో ఈ నెల 27, 28, 29వ తేదీల్లో మాత్రమే దరఖాస్తు, ఫీజు చెల్లించొచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

మున్సిపాల్టీలకు స్పెషల్ బాసులు…!