విద్యార్థులకు, నిరుద్యోగులకు తోడ్పాటే లక్ష్యం
– వచ్చే నెల నుంచి ఎంసెట్ ఫ్రీ కోచింగ్
– టైలరింగ్, స్వయం ఉపాధి రంగాలలో శిక్షణ
– తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద విద్యార్థులకు విద్యలో, ఇతర రంగాల్లోని నిరుద్యోగులకు తోడ్పాటు అందించడమే లక్ష్యంగా తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్ తెలిపారు. బుధవారం అసోసియేషన్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులకు తోడ్పాటు అందించడమే లక్ష్యంగా అసోసియేషన్ ముందుకు సాగుతుందని అన్నారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈ సారి కూడా ఇంటర్ విద్యార్థులకు వచ్చేనెల మార్చి 25 నుంచి ఉచిత ఎంసెట్ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కోచింగ్ లో చేరాలనుకునే విద్యార్థులు మార్చి 15 నుంచి 24వ తేదిలోపు కార్యాలయంలో ఆధార్ కార్డు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.
అదేవిధంగా అసోసియేషన్ తరుపున నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెహెందీ డిజైన్, టైలరింగ్ తో పాటు ఇతర రంగాలలో శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ సౌకర్యాలను విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ సలీం, ప్రధాన కార్యదర్శి ఎండీ యూనుస్, కోశాధికారి ఎండి సిరాజ్, సభ్యులు అబ్దుల్ ఖయ్యూం, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బాసిత్ అలీ, అబ్దుల్ ఖవి, అబ్దుల్ హమీద్, అబ్దుల్ ఖయ్యూం, అబ్దుల్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

