డా. జయప్రసాద్ సేవలు అభినందనీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

డా. జయప్రసాద్ సేవలు అభినందనీయం
– సన్మానించిన తాండూరు కురువ సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బడుగు బలహీన వర్గాల కోసం తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా. జయప్రసాద్ అందిస్తున్న సేవలు అభినందనీయమని తాండూరు డివిజన్ కురువ సంఘం నాయకులు అన్నారు. గురువారం డా.జయప్రసాద్ను కురువ సంఘం నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఉత్తమ అవార్డును పొందడం పట్ల డా.జయప్రసాద్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం వైద్య వృత్తి ద్వారా డా.జయప్రసాద్ సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఆయన అందిస్తున్న సేవలకు గాను మరిన్ని ఉత్తమ అవార్డులు పొందాలని, కీర్తీ ప్రతిష్ఠలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కురువ సంఘం డివిజన్ గౌరవాధ్యక్షులు న్యాయవాది గోపాల్, ఉపాధ్యక్షులు పూజారి పాండు, యాలాల మండల గౌరవాధ్యక్షులు రాఘాపూర్ వెంకటయ్య, తాండూరు మండల గౌరవాధ్యక్షులు చీమల నర్సింలు, ఆంజనేయకులు కురువ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ కల్పనే లక్ష్యం