ఘనంగా బషీరాబాద్ నేత కుమారుడి వివాహాం
– హాజరైన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– వధూ వరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని క్యాద్గిరా గ్రామానికి చెందిన రాజకీయ నాయకులు మడపతి జగదీశ్వరయ్య, జగదేవి దంపతుల కుమారుడు విజయ్ కుమార్ వివాహాము స్నేహ(అఖిల)తో శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్‌లో ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు రాంచెంద్రారెడ్డి, బంటు వేణుగోపాల్, జోషి వికాష్, మాజీ సర్పంచ్ మాణిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. అదేవిధంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి పంజుగుల విఠల్ రెడ్డి కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి(రాజు), యువనాయకులు తదితరులు ఉన్నారు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ మెంబర్ ఎం. రమేష్ మహరాజ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు బషీరాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్ మాధవరెడ్డి, తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్‌లు కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, స్వప్న పరిమళ్ గుప్త, సునితా సంపత్, తెలంగాణ బీసీ కమీషన్ మాజీ సభ్యులు నూలి శుభప్రద్ పటే్ల్, నావంద్గి సోసైటి చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు కూడా హాజరై కొత్త జంటకు శుభాశీస్సులు అందించారు.

ఇదికూడా చదవండి..

