మున్సిపల్‌ కమిషనర్ బదిలీ..?

తాండూరు రాజకీయం వికారాబాద్

మున్సిపల్‌ కమిషనర్ బదిలీ..?
– రెండు.. మూడు రోజుల్లో.. ఉత్తర్వులు జారీ
– కొత్త కమిషనర్‌గా ఆయనకు చాన్స్.. కానీ…
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి బదిలీ కాబోతున్నట్లు సమాచారం. సోమవారం కమీషనర్ బదిలీ ప్రచారం జోరుగా సాగింది. తాండూరు మున్సిపల్‌ కమీషనర్‌గా విక్రమ్ సింహారెడ్డి సుమారు రెండేళ్లుగా పనిచేస్తున్నారు.

గత కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో మున్సిపల్ కమీషనర్ల బదిలీలు జరిగాయి. అప్పట్లోనే తాండూరు కమీషనర్ కూడా బదిలీ అవుతారని ప్రచారం జరిగింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయన బదిలీ జరగలేదని ప్రచారం ఉంది. తాజాగా కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి బదిలీ అవుతున్నట్లు తెలిసింది. రెండు, మూడుల్లో రోజుల్లో ఉత్తర్వులు జారీ అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.

అయితే కొత్తగా కమీషనర్‌గా విధుల్లోకి ఎవరు వస్తారనే స్పష్టత రాలేదు. కొన్ని రోజుల పాటు ఇంచార్జ్ కమీషనర్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిపై కథనాలు వెలువడ్డాయి. తాజాగా మున్సిపల్‌ కార్మికుల కోసం కొనుగోలు చేసిన అలవెన్స్‌ కిట్ల కొనుగోలులో విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు రెండు రోజుల క్రితమే తాండూరు మున్సిపల్ పరిధిలో గత ప్రభుత్వ హాయంలో రెండో విడత పట్టణ ప్రగతి నిధుల దుర్వినియోగంలో పాత కమీషనర్‌పై ఏసీబీ కేసు నమోదు అయిన కొన్ని రోజుల్లోనే కమీషనర్ బదిలీ వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. కానీ తాండూరు పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా ఆక్రమణల తొలగింపు విషయంలో కమీషనర్ విక్రమ్ రెడ్డికి మంచి పేరు వచ్చింది. ఇదిలా ఉండగా కొత్త కమీషనర్‌గా గతంలో ఇక్కడి పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి వచ్చే అవకాశం ఉండేదని, పట్టణ ప్రగతి నిధుల దుర్వినియోగం అభియోగంలో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడంతో ఆయన వచ్చే అవకాశం లేదని తెలిసింది.

ఇదికూడా చదవండి…

ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు