నగరేశ్వర దేవాలయంలో ఆషాఢ శోభ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నగరేశ్వర దేవాలయంలో ఆషాఢ శోభ..!
– వాసవీ మాతకు శాకాంబరీ అలంకరణ
– వైభవంగా వారాహీ మాతకు పూజలు
– ఉత్సహాంగా గోరింటాకు సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో ఆషాఢ మాసం శుభశోభసంతరించుకుంది. దేవాలయంలో వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, గొరింటాకు ఉత్సవాలు నిర్వహించారు.

ఆషాఢ మాసంను పురస్కరించుకుని ఆలయంలో వెలసిన వాసవీ మాతను ఆకు కూరలు, కూరగాయలతో శాకాంబరీ మాతగా అలంకరించారు. అదేవిధంగా దేవాలయంలో వారాహీ మాతను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ లు కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, తాటికొండ స్వప్న పరిమళ్ లు హాజరయ్యారు.

అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు సంప్రదాయంగా జరుపుకునే గొరింటాకు ఉత్సవాన్ని ఉత్సహంగా జరుపుకున్నారు. అరచేతులకు గొరింటాకు ఎట్టుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వాసవీ మాత కృపతో అందరికి మంచి జరగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వాసవీ మహిళా సంఘం కార్యదర్శి మంకాల స్వప్న, కోశాధికారి సంగంశెట్టి శోభ, సభ్యులు, ఆర్యవైశ్య సంఘం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమురయ్య..!