ద‌ళిత యువ‌తి, మ‌హిళ‌ల‌కు మంచి అవ‌కాశం

తాండూరు వికారాబాద్

ద‌ళిత యువ‌తి, మ‌హిళ‌ల‌కు మంచి అవ‌కాశం
– ఉచిత కుట్టు శిక్ష‌ణ కోసం ప్ర‌వేశాల ఆహ్వానం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులోని ద‌ళిత యువ‌తీ, మ‌హిళ‌ల స్వ‌యం ఉపాధి క‌ల్ప‌న కోసం మంచి అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నారు. ఎస్సీ కార్పోరేష‌న్ స‌హాకారంతో తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి పాత తాండూరు ఎంఐఎం కౌన్సిల‌ర్ బొంబీనా ఆధ్వ‌ర్యంలో ఉచిత కుట్టు శిక్ష‌ణ శిబిరాన్ని నిర్వ‌హిస్తున్నారు. పాత తాండూరులోని అంబేద్క‌ర్ పార్కులో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన 18 ఏండ్లు నిండిన యువ‌తుల‌తో పాటు 40 ఏండ్ల‌లోపు మ‌హిళ‌ల‌కు ఉచితంగా కుట్టు శిక్ష‌ణ ఇస్తున్న‌ట్లు కౌన్సిల‌ర్ బొంబీనా తెలిపారు. మూడు నెల‌ల శిక్ష‌ణ త‌రువాత స‌ర్టిఫికెట్‌తో పాటు కుట్టు మిష‌న్‌ను ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఆస‌క్తిగ‌ల మ‌హిళ‌లు, యువ‌తులు ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు, కుల దృవీక‌ర‌ణ ప‌త్రం, రెండు పాస్ ఫోటోలు తీసుక‌వ‌చ్చి అడ్మిష‌న్ పొందవ‌చ్చ‌న్నారు. ఈ అవ‌కాశాన్ని అంద‌రు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.