తాండూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్
– 44 బైకులు, 2 ఆటోలు, కార్ సీజ్
– నెంబర్ ప్లేట్లు లేని వాహనదారులకు వార్నింగ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిల ఆదేశాల మేరకు తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్, రూరల్ సీఐ నగేష్‌ల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం తాండూరు పట్టణం మాణిక్ కాలనీలో ఈ కార్డెన్ సెర్చ్ కొనసాగింది.

ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది మొత్తం సుమారు 40 మంది పాల్గొని కాలనీని జల్లెడ పట్టారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని 44 మోటార్ సైకిల్స్, 2 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సంరక్షణ కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఎవరైనా అనుమానితులు ఉంటే వారి నుంచి నేరాలు, ప్రమాదాలను నియంత్రించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కార్డెన్ సెర్చ్‌లో సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు గుర్తించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి వాహనదారుడు నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా అమర్చుకోవాలని సూచించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

