వీఎన్ గౌడ్ ఇంటికి విఠ‌ల్‌రెడ్డి

తాండూరు రాజకీయం

వీఎన్ గౌడ్ ఇంటికి విఠ‌ల్‌రెడ్డి
– నివాసంలో పార్టీ గురించి చ‌ర్చ‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ విశ్వ‌నాథ్ గౌడ్(వీఎన్ గౌడ్‌) నివాసాన్ని తాండూరు ఎమ్మెల్యే తండ్రి విఠ‌ల్ రెడ్డి సంద‌ర్శించారు. గురువారం ఉద‌యం ఎమ్మెల్యే తండ్రి విఠ‌ల్ రెడ్డి మాజీ చైర్మ‌న్ విశ్వ‌నాథ్ గౌడ్‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా పార్టీ విష‌యాల‌పై ఇరువురు చ‌ర్చించుకున్నారు.
టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి పూర్తి స‌హాకారం అందించాల‌ని విఠ‌ల్ రెడ్డి విశ్వ‌నాథ్‌గౌడ్‌ను కోరారు. ఇందుకు విశ్వ‌నాథ్ గౌడ్ ప్ర‌జ‌ల సంక్షేమానికి పాటుప‌డే ప్ర‌భుత్వానికి, పార్టీకి పూర్తి స‌హాకారం ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. మ‌రోవైపు నివాసానికి వ‌చ్చిన విఠ‌ల్ రెడ్డిని విశ్వ‌నాథ్‌గౌడ్ శాలువాతో స‌త్క‌రించి స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో తాండూరు మార్కెట్ క‌మిటి వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయ‌కులు న‌ర్సిరెడ్డి(రాజు), సీనీయ‌ర్ నాయ‌కులు హ‌రిహ‌ర గౌడ్‌లు ఉన్నారు.