తాండూరు మార్కెట్ నిర్మాణానికి లైన్ క్లీయర్ ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు మార్కెట్ నిర్మాణానికి లైన్ క్లీయర్ ..!
– ఎమ్మెల్యే విజ్ఞప్తికి మంత్రి తుమ్మల ఆదేశాలు
– మంత్రి నాగేశ్వర్ రావును కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మార్కెట్ యార్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు.

ఇందుకోసం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషి చేశారు. బుధవారం హైదరాబాద్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరులో కొత్తగా నిర్మించే మార్కెట్ యార్డుకు అనుమతులు ఇప్పించాలని మంత్రిని కోరారు.

ఇందుకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు నిర్మాణ అనుమతులపై ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రకటించారు. దీంతో తాండూరు మార్కెట్ యార్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోతున్నాయి.

ఇదికూడా చదవండి…

మహిమాన్వితం అయ్యప్ప మహా పడిపూజ