పోట్లీ మహారాజ్ దేవాలయ పురోగతికి కృషి చేయండి
– దేవాలయ చైర్మన్, ఈఓలకు ఎమ్మెల్యే సూచన
– కొత్త దుకాణాలకు లైన్ క్లీయర్ పట్ల హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పోట్లీ మహారాజ్ దేవాలయ పురోగతికి అందరి సహాకారంతో కృషి చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు.

బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్, ఈఓ నరేందర్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో పోట్లీ మహరాజ్ దేవాలయానికి సంబంధించిన దుకాణాలు శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త దుకాణాల నిర్మాణాలకు అనుమతులు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు.

తాజాగా కొత్త దుకాణాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేవాలయ పురోగతికి సహకరించడం పట్లం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దుకాణ కిరాయి దారులు, సభ్యుల సమన్వయంతో నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని సూచించినట్లు చైర్మన్ ప్రసాద్ గౌడ్, ఈఓ నరేందర్ లు తెలిపారు.

ఇదికూడా చదవండి…

