రెచ్చిపోయిన రాబరీగాళ్లు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రెచ్చిపోయిన రాబరీగాళ్లు..!
– పోలీసులం అంటూ వచ్చి బంగారం దోపిడి
– బైకుపై వెళుతున్న అన్న, చెల్లిని బెదిరించి లూటీ
– యాలాల కమాల్ పూర్ సమీపంలో ఘటన
– దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
– బీదర్ గ్యాంగ్‌గా అనుమానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దారి దోపిడిలకు పాల్పడుతున్న రాబరీగాళ్లు రెచ్చిపోయారు. మేం పోలీసులం.. బంగారం ఆభరాణాల కోసం హత్య జరిగిందని, ఆభరణాలను బ్యాగులో ఉంచుకోవాలని చెప్పిన మాటలను నమ్మకపోవడంతో అన్నా, చెల్లిని బెదిరించి బంగారం నగలను దోచుకెళ్లారు.

ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో కలకలం రేపింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాస్నం గ్రామానికి చెందిన కోటం వెంకటలక్ష్మీ, ఆమె అన్న గోపాల్ రెడ్డిలు బుధవారం తాండూరు నుంచి బైకుపై గ్రామానికి వెళుతున్నారు. మార్గంలోని కమాల్ పూర్ – విశ్వనాథ్ పూర్ గ్రామ సమీపంలోని రాగానే ఓ ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి వారిని అడ్డగించారు. మేము పోలీసులం అని చెబుతూ దారిలో బంగారం కోసం హత్య జరిగిందని చెప్పారు. కావున బంగారం ఆబరణాలను తీసి బ్యాగులో ఉంచుకోవాలని చెప్పారు. అంతలోనే మరో ఇద్దరు బైకుపై వచ్చి జాగ్రత్తలు చెప్పడంలో ఈ మాటలకు వెంకటలక్ష్మీ అనుమానం రావడంతో వెంటనే వారు అసలు రూపం బయటపెట్టారు.

బంగారు ఆబరణాలు తీస్తారా లేదా అంటూ బెధిరింపులకు పాల్పడ్డారు. ఒంటిపై నుంచి ఆబరణాలు తీస్తుండగానే వాటిని దుండలు లాక్కుని బైకులపై పరారయ్యారు. అప్రమత్తమై బాధితులు వెంటనే డయల్ 100కు ఫోన్‌ చేసి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డిలు బాధితులతో మాట్లాడారు. దోపిడికి పాల్పడిన వారి వివరాలను ఆరా తీశారు. వెంటనే విచారణ ముమ్మరం చేసి సీసీ కెమెరాలు ఉన్న మార్గాలను పుటేజీలో పరిశీలిస్తున్నారు. బీదర్ కు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారి దోపిడిలో సుమారు నాలుగు తులాల బంగారం అపహరించుకు పోయినట్లు బాధితులు తెలిపారు. ఈ సంఘటన యాలాల మండలంలో కలకలం రేపింది.

ఇదికూడా చదవండి…

వైభవంగా మార్కండేయ స్వామి జయంతి