మోగిన బల్దియా నగరా…!
– ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమీషన్
– నామినేసన్లు స్వీకరణ, పోలింగ్ తేది ఖరారు
– ఎన్నికల కౌంటింగ్ జరిగేది అరోజే..
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాల్టీలలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ పుర పోరుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది.

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు సీఈవో తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌తో రాజకీయ పార్టీలు, ఆశావాహులు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.


ఇదికూడా చదవండి…

