మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

జాతీయం తెలంగాణ హైదరాబాద్

మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
– 22 క్యారెట్‌, 24 క్యారెట్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే
ద‌ర్శిని డెస్క్ : కొన్ని రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌లు ప‌డిలేస్తున్నాయి. గ‌త నెల దిగివ‌చ్చిన ధ‌ర‌లు ఈనెల‌లో పెరుగుతూ వ‌చ్చాయి. తాజాగా మార్కెట్లో పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.750, 24 క్యారెట్లపై రూ.820 మేర తగ్గింది. ఇదిలా ఉంటే దేశీయంగా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.100 మేర పెరిగి.. రూ.57,000 లుగా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,110 వద్ద ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,970 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150 ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.57,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.62,400 ఉంది. బెంగళూరులో రూ.62,400, కేరళలో రూ.62,400 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,400, విజయవాడలో రూ.62,400, విశాఖపట్నంలో రూ.62,400 లుగా కొనసాగుతోంది.

ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.