వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు..!

తాండూరు వికారాబాద్

వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు..!
– ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి
– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. స్వర్ణకుమారి
– ఎంసీహెచ్, ఆరోగ్య కేంద్రాల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయరాదని, ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. స్వర్ణకుమారి అన్నారు.

మంగళవారం తాండూరు పట్టణంలో అర్బన్ ఆరోగ్య కేంద్రాన్ని, మాతా శిశు ఆసుపత్రిని ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మందులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రికి చేరుకుని అక్కడ నిర్వహిస్తున్న డిస్ట్రిక్ ఎర్లి ఇంటర్వేన్షన్ సెంటర్ ను, న్యూట్రీషన్ రిహాబిలిటేషన్ సెంటర్లను తనిఖీ చేశారు.

ఆయా సెంటర్లలో అందిస్తున్న సేవలను ఆరా తీశారు. పోషకారలోపంతో ఉన్న చిన్నారులకు సరైన పోషకాహారం అందించాలని అన్నారు. చిన్నారులకు సాధారణ బరువులోకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. అంతేకాకుండా పిల్లలతో ఉండే తల్లిదండ్రులకు దినసరి కూలీ నష్టపోకుండా నిబందనల ప్రకారం డైలీ వేజేస్ అందించాలన్నారు. ఆమె వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శ్రీనివాస్, ఆస్తిన్, మలేరియా అధికారి సత్యం, హెచ్ సువర్ణ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మోగిన బల్దియా నగరా…!