ఉపాధ్యాయ కుటుంబానికి చేయూత..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఉపాధ్యాయ కుటుంబానికి చేయూత..!
– ఎమ్మెల్యే సహాకారంతో ఆర్థిక సాయం
– కృతజ్ఞతలు తెలిపిన కుటుంభీకులు, పీఆర్టీయూ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందిన ఉపాధ్యాయుడి కుటుంబానికి చేయూత అందింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో ఆర్థిక సాయం కుటుంబ సభ్యుల చేతికందింది.

వివరాల్లోకి వెళితే.. యాలాల మండలం కోకట్ గ్రామానికి చెందిన మహమూద్ అదే మండలం రాస్నం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో హింధీ భాషోపాధ్యాయులుగా, పీఆర్టీయూలో మండల కార్యవర్గ సభ్యులుగా పనిచేసే వారు. ఈనెల 3న ఇంట్లో పిండి గిర్ని విద్యుత్ వైర్లను సరిచేస్తుండగా ప్రమాద వశాత్తు షాక్‌కు గురై కన్నుమూశారు. యాలాల మండల పీఆర్టీయూ నేతల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పీఆర్టీయూ నేతల విజ్ఞప్తి మేరకు కుటుంబానికి రూ. 51వేల ఆర్థిక సాయం అందజేశారు. అంతకుముందే కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. కుటుంబానికి తమవంతు తోడ్పాటు అందిస్తామని భరోసా అందించారు. అనంతరం మహమూద్ భార్య ఫర్జానా జబీన్‌కు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు యాలాల మండల పీఆర్టీయూ అధ్యక్షులు కృష్ణారెడ్డి, నేతలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టసమయంలో ఉపాధ్యాయ కుటుంబానికి అండగా నిలిచి మానవత్వం చాటుకోవడం పట్ల పీఆర్టీయూ శాఖ తరుపున ఎమ్మెల్యేకు కృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

తాండూరుపై ప్రత్యేక విజన్‌..!