ప్రచారంలో బీసీ సంఘం దూకుడు

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రచారంలో బీసీ సంఘం దూకుడు
– రోహిత్ రెడ్డి కోసం జోరుగా ప్రచారం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సంఘం నాయకులు దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి’ కోసం గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

శనివారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ ఆదేశాల మేరకు తాండూరు మండలంలోని అంతారం, దస్తగిరిపేట్, చెన్ గెష్ పూర్ గ్రామాల్లో సంఘం నాయకులు ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు.

ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీసీల కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే బీసీల అభివృద్ధికి తోడ్పడుతారని అన్నారు. బీసీలు అందరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అంతారం సర్పంచ్ రాములు, ఎంపీటీసీ శాంతు, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, యువనాయకులు రాము ముదిరాజ్, వెంకటేష్, సురేందర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!