సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే
– మున్సిపల్ హస్తగతంపై హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది కౌన్సిలర్లు గెలిచి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ స్థానాలను హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ల గెలుపుకు కృషి చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంక్షేమ సారథి కేసీఆర్..!