స్పాట్‌ బిల్లర్స్‌ డిమాండ్లు పరిష్కరించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

స్పాట్‌ బిల్లర్స్‌ డిమాండ్లు పరిష్కరించాలి
– పని దినాల కుదింపు ఒత్తిడి తగదు
– తాండూరులో విధుల బహిష్కరణ
– రేపు దర్నాచౌక్‌ ఆందోళనకు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ స్పాట్ బిల్లర్ల డిమాండ్లను పరిష్కరించాలని పలువరు డిమాండ్ చేశారు. ఆదివారం తాండూరు పట్టణంలోని విద్యుత్ డీఈ కార్యాలయంలో విద్యుత్ స్పాట్ బిల్లర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీడీసీఎల్‌లో స్పాట్‌ బిల్లర్లకు గతంలో ప్రతినెలా 2వ తేది నుంచి 12వ తేది వరకు విద్యుత్ మీటర్ల బిల్లింగ్ చేసేశావారని తెలిపారు. ప్రస్తుతం ఈ పనిదినాలను ఆరు రోజులకు కుదిస్తూ.. స్పాట్ బిల్లింగ్‌లను ఈ గుడువులోనే పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు రోజుల్లో పనిచేస్తే మిగతా 24 రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుందని తెలిపారు.

అయితే ఎన్పీడీసీఎల్‌లో పనిచేస్తున్న బిల్లర్లకు బిల్లింగ్ అనంతరం 24రోజులు పనికల్పిస్తున్నారని, అదే తరహాలో ఎస్పీడీసీఎల్‌లో పనిదినాలు కల్పించాలని అధికారులను కోరినా స్పందన కరువైందని తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే విధులు బహిష్కరిస్తామని గత నెల 25న నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే విధులు బహిష్కరించడం జరిగిందని వివరించారు. అదేవిధంగా డిమాండ్ల సాధన కోసం రేపు హైదరాబాద్‌ దర్నాచౌక్‌లో నిర్వహిస్తున్న ఆందోళణకు తరలివెళుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు విద్యుత్ స్పాట్ బిల్లర్ల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

కురుమల గౌరవానికి తోడ్పడతా..!