ప్రజానేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజానేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– అట్టహాసంగా జన్మదిన వేడుకలు
– శుభాకాంక్షలు తెలిపిన పటేల్ కిరణ్‌ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజల గుండెల్లో కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్‌ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌ రెడ్డి ప్రజానేతగా నిలిచారని భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్, దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్‌ కుమార్ అన్నారు.

మంగళవారం బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు అట్టహాసంగా ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా పటేల్ కిరణ్‌ కుమార్‌ శ్రీనివాస్ రెడ్డిని కలిసి గజమాలతో సత్కరించారు. కేక్‌ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పటేల్ కిరణ్‌ కుమార్ మాట్లాడుతూ తాండూరు ప్రజల మనస్సులో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రజానేతగా, మార్గదర్శిగా, ధైర్యశాలిగా నిలిచారని అన్నారు.

తాండూరు ప్రాంతంలో ఆపదలో ఉన్న పేదలకు శ్రీనివాస్ రెడ్డి అండగా నిలిచారని అన్నారు. చిన్నారులకు, విద్యార్థులకు విద్యా, వైద్య రంగంలో తోడ్పాటు అందించారని గుర్తుచేశారు. శ్రీనివాస్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, రానున్న రోజుల్లో రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించి మనసున్న మహరాజుగా ఎదగాలని ఆకాంక్షించారు.

వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించండి..!