విద్యతోనే గుర్తింపు
– పుస్తకాలు పంపిణీ చేసిన కౌన్సిలర్ బొంబీనా
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యలో రాణిస్తనేనే విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుందని తాండూరు మున్సిపల్ 14 వ వార్డు ఎంఐఎం కౌన్సిలర్ బొంబీనా అన్నారు. గురువారం మున్సిపల్ పరిధి పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్ 2 పాఠశాలలో తెలుగు మీడియం పదో తరగతి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ బొంబీనా హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య అందరికి ఉపయోగమైందన్నారు. విద్యతోనే మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. జీవితంలో స్థిరపడాలంటే చక్కగా చదువుకోవాలన్నారు. సర్కారు బడుల్లో కార్పోరేట్‌కు ధీటుగా అందిస్తున్న విద్యను అందరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నళిని,ఉపాధ్యాయులు ప్రతిభ భారతి, నిర్మల, శ్రీనివాస్, సంతోష్ కుమార్, హరీష్ కుమార్, దామోదర్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



