శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభకాంక్షలు
– బీఎస్‌ఆర్‌ను సన్మానించిన పీవీఆర్ మిత్ర బృందం
– శ్రీనన్న పేరుతో సాంగ్ అంకితం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నేత, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి పెరుమాళ్ల వెంకట్ రెడ్డి(పీవీఆర్) ఎడ్యూకేషనల్ సోసైటీ చైర్మన్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, మిత్ర బృందం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మంగళవారం రాత్రి ఆయన నివాసంలో శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులను పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, సీనీయర్ జర్నలిస్టులు రామకృష్ణ(ఆర్కే), జగన్నాథ్ రెడ్డి, మహేష్, మిత్రులు ఘనంగా సన్మానించారు. శ్రీనివాస్ రెడ్డి చేత కేక్ కట్ చేయించి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డిపై రూపొందించిన సాంగ్‌ను ఆయన దినోత్సవం సందర్భంగా అంకితం చేశారు. శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పీవీఆర్, మిత్ర బృందం ఆకాంక్షించారు.


