హనుమాన్‌ దీక్షతో శుభయోగం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హనుమాన్‌ దీక్షతో శుభయోగం..!
– రేపు హనుమాన్ అర్థ మండల దీక్ష ప్రారంభం
– హనుమాన్ దీక్ష సమితి సభ్యులు వినోద్‌ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : హనుమాన్ దీక్షతో అందరికి శుభయోగం కలుగుతుందని దీక్షా సమితి సభ్యులు వినోద్ కుమార్ అన్నారు.

గురువారం తాండూరు పట్టణంలోని కన్య ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో హనుమాన్ అర్థమ మండల దీక్ష రేపు ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు నియోజకవర్గంకు చెందిన సుమారు 20 మంది యువకులు హనుమాన్ దీక్ష తీసుకుంటున్నట్లు తెలిపారు.

హనుమాన్ దీక్ష స్వామి జయంతి నాటికి పూర్తి అవుతుందని చెప్పారు. దీక్ష పూర్తయిన తరువాత నల్లమల్ల అడవులలోని పబ్బతి ఆంజనేయస్వామి మద్దిమడుగు క్షేత్రంలో పవనమూడి సమర్పిస్తారని వివరించారు. హనుమాన్ దీక్ష ద్వారా చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయని అన్నారు. ఆసక్తిగల భక్తులు హనుమాన్ దీక్షను చేపట్టవచ్చని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు.

సంక్షేమానికే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక