అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరువచేయండి
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచన
– సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన కార్యక్రమంలో ప్రోట్రెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ప్రమాణ స్వీకారం చేయించిన తరువాత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంపట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మహేందర్ రెడ్డిని అభినందిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా కృషి చేయాలని సూచించారు. ఇందుకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనవంతు బాధ్యతగా కృషి చేస్తానని హామి ఇచ్చారు.
మరోవైపు వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియామకమైన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కూడ సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కోడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, యువనాయకులు కార్తిక్ రెడ్డిలు ఉన్నారు.

