మత సామరస్యతను చాటే రంజాన్..!
– ఐక్యతతో పండగను జరుపుకోవాలి
– కాంగ్రెస్ యువనాయకులు బిడ్కర్ రఘు
– గాంధీనగర్‌లో రంజాన్ కిట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్ని వర్గాల మద్య మత సామరస్యతను చాటడంలో రంజాన్ పండగ ప్రత్యేకంగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బిడ్కర్ రఘు అన్నారు.

రంజాన్ పండగను పురస్కరించుకుని ప్రభుత్వం మంజూరు చేసిన రంజాన్ కిట్లను శుక్రవారం బిడ్కర్ రఘు పంపిణీ చేశారు. పట్టణంలోని తన వార్డు 20లో ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యతకు, ఐక్యతకు రంజాన్ పండగ ప్రతీకగా నిలుస్తుందని అభివర్ణించారు. రంజాన్ పండగను సంతోషంగా అందరు కలిసిమెలిసి జరుపుకోవాలన్నారు. ముస్లిం సోదరుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మైనార్టీ సోదరులు, యువకులు పాల్గొన్నారు.


