వికసిత్ భారత్ లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి
– వికారాబాద్ జిల్లా యువజన క్రీడల అధికారి సత్తార్
– పీపుల్స్ కాలేజీలో ఘనంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేపడుతున్న వికసిత్ భారత్ లక్ష్యాలను అందిపుచ్చుకోవాలని వికారాబాద్ జిల్లా యువజన క్రీడల అధికారి సత్తార్ అన్నారు.

శుక్రవారం తాండూరు పట్టణం పీపుల్స్ కాలేజీలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత దేశంలో ఎమర్జెన్సీ(అత్యవసర) పరిస్థితి 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా యువజన క్రీడల అధికారి సత్తార్, రంగారెడ్డి జిల్లా యువజన అధికారి ఈశయ్యలు హాజరయ్యారు. ఇందులో భాగంగా వివిధ కళాశాలలో నుంచి విద్యార్థులు పాల్గొని ఎమర్జెన్సీ తరువాత భారత దేశంలో నేర్చుకున్న అంశాలు, మార్పులపై ఉపన్యాసాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా సత్తార్ మాట్లాడుతూ భారత దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ ద్వారా ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు. సాంకేతికం, విద్యా, వైద్యం ఇతర రంగాలలో తీసుకవచ్చే లక్ష్యాలను అందరు అందిపుచ్చుకోవాలని అన్నారు. అనంతరం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డీనేటర్ డా.చెల్లమల్ల వెంకటేశ్వర్లు, ఫ్రోఫెసర్ క్రిష్ణకుమార్, హన్మంతురావు, మహేందర్ రెడ్డి, పీపుల్స్ కాలేజీ ప్రిన్సిపల్ చంద్రకళ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆపీసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


