పోట్లీ మహరాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

పోట్లీ మహరాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఘనంగా దేవాలయ రాజగోపుర నిర్మాణ పూజ
– దుకాణాల సముదాయాల పునర్‌ నిర్మాణంకు భూమి పూజ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రసిద్ద పోట్లీ మహరాజ్ దేవాలయం అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

బుధవారం దేవాలయ రాజగోపురం నిర్మాణ పూజ, 28 దుకాణ సముదాయాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోట్లీ మహారాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. దేవాలయంలో రాజగోపురంతో కీర్తి పెరుగుతుందని, దుకాణాల నిర్మాణం చేపట్టడం వల్ల దేవాలయానికి ఆదాయం పెరుగుతుందని అన్నారు.

పాత దుకాణాల స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు దుకాణదారులు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్, ఈఓ తాడెం నరేందర్, కాంగ్రెస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, కౌన్సిలర్లు నాగారం మల్లేశం, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, దేవాలయ కమిటి సభ్యులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్, ఏఎంసీ చైర్మన్‌లకు సత్కారం