ఎంఈఓ ఇందుప్రియకు సన్మానం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎంఈఓ ఇందుప్రియకు సన్మానం
– శుభాకాంక్షలు తెలిపిన పీఆర్టీయూ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల విద్యాధికారిణి ఇందుప్రియకు పీఆర్టీయూ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇదివరకు మండల విద్యాధికారిగా పనిచేసిన వెంకటయ్య గౌడ్ ఇటీవలే పదవి విరమణ పొందారు.

ఆయన స్థానంలో నూతన మండల విద్యాధికారిగా ఇందుప్రియ బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపకులు గాల్‌రెడ్డి హర్షవర్దన్‌ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య పిలుపు మేరకు తాండూరు పీఆర్టీయూ సీనీయర్ నాయకులు మహమ్మద్‌ ఖుద్దూస్, అబ్దుల్ రహమాన్, మహమ్మద్ ఓమర్‌లు ఎంఈఓ ఇందుప్రియను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

శాలువాతో సత్కరించి.. పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు మండలంలో విద్యాధిభివృద్ధితో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.

తాండూరుకు రూ. 2.81 కోట్లు..!