మాట నిలబెట్టుకున్న మనోహరన్న..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మాట నిలబెట్టుకున్న మనోహరన్న..!
– దివ్యాంగురాలికి రూ.50 వేల ఆర్థిక సాయం
– వాహనం కొనుగోలుకు చేయూత
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మరోసారి ఆపన్న కుటుంబానికి అండగా నిలిచారు.

పెద్దేముల్‌ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన చాకలి పుష్పమ్మ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, దివ్యాంగుల వాహనం కొనుగోలు కోసం రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు.

గతంలో గ్రామ పర్యటనకు వెళ్లిన సమయంలో పుష్పమ్మ కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తాజాగా ఆర్థిక సహాయం అందించి తన మాటను కార్యరూపంలో పెట్టారు.

ప్రజల సమస్యలను తెలుసుకుని, ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఎమ్మెల్యే స్పందించడం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఆపదలో ఉన్న కుటుంబాలకు తోడ్పాటు అందించడం, దివ్యాంగుల అవసరాలకు సహకరించడంపై ఎమ్మెల్యే సేవా స్పూర్తిని పలువురు ప్రశంసించారు.

Pvr

సొంతింటిపై సోలార్‌ ప్యానెళ్లు..!