మనసు ఫోన్ఇవ్వకుండా..!
– పిల్లలను మోబైల్ నుంచి దూరం చేయండి
– చిన్న జాగ్రత్తలు పాటిస్తే అలవాటు మారొచ్చు
దర్శిని డెస్క్: మోబైల్ ఫోన్ లేనిదే మనిషి రోజు గడవని ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. కేవలం మాటలకే కాకుండా ఎన్నో అవసరాలకు ఇప్పుడు మోబైల్ వాడుతున్నారు. ఒక సంవత్సరం పిల్లాడి నుంచి 20 ఏళ్ల కుర్రాడి వరకు మొబైల్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. ఫోన్ వినియోగం వల్ల పెద్దలకే కాదు.. పిల్లలకు ప్రమాదకరమన్నది అందరికి తెలిసిందే. పిల్లలు ఫోన్‌లపై మనసు పోనివ్వకుండా జాగ్రత్తలు తీసకుంటే వారిని కాపాడొచ్చు. కొందరు పిల్లలు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్‌తోనే గడుపుతున్నారు.
పిల్లలు ఫోన్ అలవాటైన తర్వాత దానిని దూరం చేయడం కష్టంగా మారుతుంది. చాలాసార్లు ఫోన్లు లాగేసుకుందామని ప్రయత్నిస్తుంటే ఏడవడం, కోపంతో వస్తువులు విసిరివేయడం చేస్తుంటారు. ఫోన్ తరచూగా చూస్తే వారు బాహ్యప్రపంచంతో వేరు అవుతారు. ఇలా వారికి లోకం ఏంటో తెలియదు.
అధిక వాడకం అనర్థమే..
పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ వైపు చూస్తుంటే వచ్చే అనర్థాలు చాలా జరుగుతాయి. బాల్యంలో పిల్లల మెదడు అభివృద్ధి చెందే సమయం. ఆ సమయంలో మొబైల్లో వచ్చే అనవసర విషయాలు మెదడు పనితీరు మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
స్మార్ట్‌ఫోన్ నుంచి వచ్చే కిరణాలు పిల్లల కాళ్లకే కాదు మెదడు కణాలకు కూడా హానికరమే. దీనివల్ల కంటి చూపుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ అధిక వాడకంతో పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలా చేస్తే ప్రయోజనం..
పిల్లలను మోబైల్ వాడకాన్ని దూరం చేసే అలవాట్లను పాటించేలా చూస్తే ప్రయోజనం ఉంటుంది. మొదటగా పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దు. ఒకవేళ ఇచ్చినా చాలా తక్కువ సమయం ఇవ్వాలి. పిల్లలకి ఆన్ లైన్ క్లాసులు ఉన్నట్లయితే కళ్లకి రక్షణ ఇచ్చే అద్దాలు తీసుకురావాలి. ఆన్ లైన్ క్లాసులకి తప్ప మిగతా పనులకి ఫోన్లని చేతికి ఇవ్వకూడదు. లౌడ్ స్పీకర్ పెట్టుకుని మాట్లాడేలా ప్రోత్సహించాలి. అలాగే చెవికి దగ్గరగా పెట్టుకోవద్దని సూచించాలి.

రాత్రిపూట ఫోన్ అస్సలు ముట్టుకోనివద్దు. వారిని వీలైనంత ఎక్కువ సేపు బయటకు తీసుకెళ్లాలి. మైదనానికి, షాపింగ్‌కు ఇలా బయటకు తీసుకెళ్లడం ద్వారా వారి మనస్సు డైవర్ట్ చేయొచ్చు. అదే కాదు ఏదైనా శారీరక శ్రమ కలిగించే ఆటల్లో భాగస్వాములని చేయాలి. పిల్లలు ఎంతసేఫు ఫోన్ వాడుతున్నారనేది పెద్దలు గమనిస్తూ ఉండాలి. మెసేజ్ చేస్తున్నారా? లేక కాల్స్ మాట్లాడుతున్నారా? ఎంతసేపు మాట్లాడుతున్నారనేది తెలుసుకోవాలి.

