సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షులుగా కలాల్ చంద్రశేఖర్ గౌడ్

తాండూరు వికారాబాద్

సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షులుగా కలాల్ చంద్రశేఖర్ గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : సమాచార హక్కు చట్టం వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా తాండూరు ప్రాంతానికి చెందిన కలాల్ చంద్రశేఖర్ గౌడ్ నియామకమయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న ఆయనను రాష్ట్ర కమిటి జిల్లా అధ్యక్షులుగా నియమించింది. మంగళవారం ఈ విషయాన్ని కలాల్ చంద్రశేఖర్ గౌడ్ స్వయంగా వెల్లడించారు. పలు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం, స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం, అవినీతి నిర్మూలనకు కృషి చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగిందని వివరించారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షులుగా నియమించడంతో పాటు ఇందుకు సహకరించిన సమాచార హక్కు చట్టం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్యాంప్రసాద్ రావు, రాష్ట్ర నియామక ఇంచార్జ్ చందమల్ల సుధాకర్, చార్మినార్ జోన్ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర మీడియా కన్వినర్ సతీష్ కుమార్ రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.